- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
ప్రజలు ఇళ్ల పరిసరాల పరిశుభ్రతను పాటించాలని జన్నారం మండలంలోని కిస్టాపూర్ గ్రామ సర్పంచ్ వాసాల నరేష్ సూచించారు. జన్నారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జన్నారం ప్రభుత్వ వైద్య సిబ్బంది స్థానిక ప్రజలకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఉన్నారు.
- Advertisement -



