హాజరు కానున్న మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం సబ్ డివిజన్లోని కాటారం,మాహముత్తారం, మల్హర్ రావు,మహదేవ్ పూర్, పలిమెల ఐదు మండలాల మండల కొత్త సర్పంచ్లకు, పాలకవర్గానికి బుధవారం కాటారం ఏవిఎస్ పంక్షన్ హాల్లో అభినందన సభ ఉంటుందని, ఈ సభకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరై సన్మాన నిర్వహించబడునని తెలిపారు. మంత్రి సహాయకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐదు మండలాల నూతన సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచ్ అభ్యర్థులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళనాయకురాలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఐదు మండలాల కొత్త సర్పంచ్ ల అభినందన సభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



