జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
వనపర్తిలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం
నవతెలంగాణ – వనపర్తి
క్రీడలతో క్రీడాకారుల్లోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వింగ్స్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వనపర్తి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే మేఘారెడ్డి తో కలిసి ప్రారంభించారు. పోలీస్ 11, అంజి 11 జట్ల మధ్య మ్యాచ్ ను ప్రారంభించి క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు జిల్లా కలెక్టర్ కొంతసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మహేష్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు.
క్రీడలతో ఆత్మవిశ్వాసం రెట్టింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



