Tuesday, December 23, 2025
E-PAPER
Homeఖమ్మంమల్లాయి గూడెం వాసి ద్వారా ప్రసాద్ కు ఉత్తమ రైతు పురస్కారం

మల్లాయి గూడెం వాసి ద్వారా ప్రసాద్ కు ఉత్తమ రైతు పురస్కారం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని మల్లాయి గూడెం వాసి ద్వారా ప్రసాద్ కు ఉత్తమ రైతు పురస్కారం దక్కింది. ఈ గ్రామానికి చెందిన దారా ప్రసాద్ జీవ,పీఎఫ్ ఏ వాసన్ ఆద్వర్యంలో “మల్లాయిగూడెం – జీవ ప్రాజెక్ట్ ” పేరుతో సహజ కషాయాలు,జీవన ఎరువులు వాడి మండలంలోని మల్లాయిగూడెం, పండువారిగూడెం,దిబ్బగూడెం, కొండతోగు,రామన్నగూడెం గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం విధానంలో చిరు ధాన్యాలు సాగుచేస్తున్నారు. 

ఈ క్రమంలో జిల్లా కేంద్రం అయిన కొత్తగూడెంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆద్వర్యంలో కృషి దివస్ – 2025 లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో జీవ ప్రాజెక్ట్ సౌజన్యంతో సంప్రదాయ సాగు,ప్రకృతి వ్యవసాయం తో పండించిన చిరుధాన్యాలు స్టాల్ ఏర్పాటు చేసారు. వ్యవసాయ రంగం లో సేవలకు గాను ఉత్తమ రైతుగా గుర్తిస్తూ, “కిసాన్ దివస్ 2025” పేరుతో జ్ఞాపిక,ప్రశంసా పత్రం అందించారు.

ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞానం కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ బి.శివ, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.హేమ శరత్ చంద్ర, ప్రోగ్రాం కోఆర్డినేటర్ టి భరత్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -