- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని జలాల్ పూర్ గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం వద్ద సిసి రోడ్డు నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి ఎంపీ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఈ విషయం మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ గుండేటి అచ్చల్ మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ కల్పన తెలిపారు. ఈ సందర్బంగా ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



