- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం మరవక ముందే హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రినాక పరిధిలోని బోయగూడలో ఓ భవనం రెండో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో అందులో ఉన్నవారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న ఛత్రినాక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్‌ల ద్వారా మంటలను అర్పారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో చెప్పుల గోదాము నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
- Advertisement -