- Advertisement -
చౌదరి చరణ్ సింగ్ జయంతి వేడుకలు
నవతెలంగాణ-రామారెడ్డి
మండల కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా 5వ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం మండల కేంద్రంలో చరణ్ సింగ్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ బండి ప్రవీణ్ మాట్లాడుతూ.. రైతు కుటుంబం నుండి వచ్చిన చరణ్ సింగ్ దేశానికి సేవలందించాడని కొనియడారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



