Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం

వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం

- Advertisement -

 నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం  చైర్మన్ పాలెపు నర్సయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి మెర్సీ గత 3 నెలలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలను పాలకవర్గం సభ్యులకు చదివి వినిపించారు.అనంతరం సభ్యులందరూ అభివృద్ధి పనులు, పలు అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి సంతకాలు చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు భూత్ పురం మహిపాల్, జీవన్, లక్మ రంజిత్, చిన్న బాబన్న, కోరిపెల్లి లింగారెడ్డి, నవీద్, రాములు, ముత్తెన్న, సూపర్ వైజర్ రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -