నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పెంటర్ చేతి వృత్తి పట్ల నిర్లక్ష్య ధోరణి చూపిస్తుందని అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ సంఘం సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎగ్గోజు సుదర్శనా చారి అన్నారు. మంగళవారం హుస్నాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెడీమేడ్ దర్వాజలు ,కిటికీలు, గుమ్మాలకు తలుపులు రెడీమేడ్ వస్తువులను అమ్ముట వల్ల కార్పెంటర్లకు నష్టం జరుగుతుందన్నారు.రెడీ మేడ్ వస్తువులు తయారు వలన కార్పెంటర్ వృత్తి ఉపాధిని కోల్పోతున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల యూపీ, రాజస్థాన్ ప్రాంతాల నుండి వచ్చిన వారికి బిల్డర్స్ ప్రోత్సహం కల్పిస్తూన్నారని చెప్పారు. స్థానికేతర వారికి అవకాశాలు కల్పించడం వల్ల గ్రామీణ, మండల స్థాయిలో ఉన్న ప్లైవుడ్ షాపులు, సామీల్ మరియు టింబర్ డిపోల కు నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసి సమస్యలను పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంగోజు భాస్కరా చారి, దేవోజు రాజమౌళి చారి తదితరులు పాల్గొన్నారు.
కార్పెంటర్ల పై ప్రభుత్వం నిర్లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


