- Advertisement -
- – విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ(యు ఎస్ ఎఫ్ ఐ, ఏఐఎస్ఎ,టి ఎన్ ఎస్ ఎఫ్)
నవతెలంగాణ – కంఠేశ్వర్
అనుమతులు లేని కోచింగ్ సెంటర్లపై డివోఓ నిర్లక్ష్య వైఖరి నశించాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ(యు ఎస్ ఎఫ్ ఐ, ఏఐఎస్ఎ,టి ఎన్ ఎస్ ఎఫ్) కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. - ఈ మేరకు మంగళవారం నగరంలోని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అనుమతి లేని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ.. నిజామాబాద్ లో ప్రభుత్వ అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్స్ ను నడిపిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు జిల్లా విద్యాశాఖ అధికారి కి ఫిర్యాదు చేసిన చర్యలు మాత్రం శూన్యమని అన్నారు.
- అలాగే ఈ కోచింగ్ సెంటర్లు విద్యాశాఖ పరిధిలోనే వస్తాయని దీనికి జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని 1997 జీవో నంబర్ 200 లో పొందుపరచడం జరిగింది అయితే ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ అధికారి తమ పరిధిలో రాదు అన్నరకంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని అన్నారు. అదేవిధంగా నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా 200 పైగా కోచింగ్ సెంటర్లు ఉన్నాయని ఈ కోచింగ్ సెంటర్ల ముఖ్య ఉద్దేశం విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడమేనని అన్నారు అలాగే కనీస విద్యార్హతలు మరియు వసతులు కల్పించకుండా కొందరు వ్యక్తులు ట్యూషన్ల పేరుతో మొదలుపెట్టి కోచింగ్ సెంటర్లుగా మారుస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా ఉండడం అనేక అనుమానాలకు దారితీస్తుందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి ఇలా అనుమతులు లేకుండా నడుస్తున్న కోచింగ్ సెంటర్లను మూసివేసే రకంగా కృషి చేయాలని లేనియెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు మహేష్, కిరణ్, జ్వాలా, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -