Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ ఫోరం మండలాధ్యక్షుడిగా మోహన్ రెడ్డి ఎన్నిక

సర్పంచ్ ఫోరం మండలాధ్యక్షుడిగా మోహన్ రెడ్డి ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
సర్పంచ్ ఫోరం బాల్కొండ మండల అధ్యక్షుడిగా జలాల్ పూర్ సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి మంగళవారం ఎన్నికయ్యారు. మండల సమగ్ర అభివృద్ధి గ్రామాల పురోభివృద్ధి, ప్రజల సంక్షేమం మంచి పరిపాలన సాధ్యమయ్యే విధంగా సమిష్టి కృషిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫోరం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గుండేటి మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడిగా ఎన్నికైనందున బాధ్యత మరింత పెరిగిందని, అందరి సహకారంతో మండల పరిధిలోని గ్రామాలు అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఫోరం సభ్యులు తహసీల్దార్ శ్రీనివాస్, రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ ఐ శైలేందర్ లను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సర్పంచ్ నల్గొండ పద్మ ఎర్రన్న, చిట్టాపూర్ సర్పంచ్ సట్ల ప్రవీణ్, బస్సాపూర్ పోలంపల్లి శ్రీనివాస్, ఇత్వార్ పెట్ సర్పంచ్ పాత్కాల లింబాద్రి, బోదేపల్లి సర్పంచ్ నీరటి రాజమణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -