- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్ ప్రముఖ నటి నుస్రాత్ ఫరియాకు బెయిల్ వచ్చింది. ఢాకాలోని చీప్ మెట్రోపాలిటన్ కోర్టు మంగళవారం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. షేక్ హాసినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో..ఓ మర్డర్ కేసులో ఆమె ప్రమేయం ఉందని ఆదేశ పోలీసులు ఢాకా ఎయిర్ పోర్టులో ఆదివారం అరెస్ట్ చేశారు. షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా 2023లో విడుదలైన ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ అనే చిత్రంలో ఆమె కీ రోల్ షోషించారు. బంగ్లాదేశ్-భారతదేశం మధ్య సహ-నిర్మాణం అయిన ఈ చిత్రానికి శ్యామ్ బెంగాల్ దర్శకత్వం వహించారు.
- Advertisement -