Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అసంక్రమిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలు పెంచండి

అసంక్రమిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలు పెంచండి

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో పల్లె దావకానాల పరిధిలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం, ఎమ్మెల్ హెచ్ పి లు అసంక్రమిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలను తక్కువగా చేసినటువంటి 35 ఆరోగ్య ఉప కేంద్రాలు పల్లె దా వకానాల సిబ్బందిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ సమీక్ష నిర్వహించారు. ఆభా రిజిస్ట్రేషన్ 10% కంటే తక్కువగా ఉండి అసంక్రమిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలను చేయడంలో అలసత్వం వహిస్తున్న సిబ్బందిని మందలించారు. అసంక్రమిక వ్యాధులైన హైపర్ టెన్షన్ మధుమేహం క్యాన్సర్ లాంటి పరీక్షలను ప్రణాళిక బద్దంగా ఈ గ్రామాల వారీగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పిలు వారి వారి లాగిన్లలో నమోదు చేయాలని రాబోయే పది రోజుల్లో వారికి ఇవ్వబడిన టార్గెట్ ను పూర్తి చేయాలన్నారు. ప్రతి సిబ్బంది సమయపాలలో పాటిస్తూ విధులకు హాజరు కావాలని ఈరోజు ఈ సమావేశానికి రానివారిపై చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలోఎన్సిడీ కోఆర్డినేటర్ వెంకటేశం, డి డి ఎం నారాయణ, పృథ్వి, హెచ్ ఈ ఓ శ్రీనివాస్ ,డి హెచ్ ఈ గన్ పూర్ వెంకటేశ్వర్లు వివిధ ఆరోగ్య కేంద్రాల ఏఎన్ఎంలు, పల్లె దావకానాల నుండి ఎమ్మెల్యే హెచ్ పీ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -