నవతెలంగాణ – నెల్లికుదురు
వాట్సాప్ గ్రూప్ లలో ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అయ్యిందని వైరల్ అవుతున్న వాటిని నమ్మవద్దు అని ఇప్పటివరకు రద్దు అయిందని ఎలాంటి జీవో రాలేదని ఎంపీడీవో కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వాట్సప్ గ్రూపులలో ఉప సర్పంచ్ పదవికి చెక్ పవర్ గతంలో ఉండేది ఇప్పుడు రద్దు అయిందని వాట్సాప్ గ్రూప్ లలో వస్తుందని కొంతమంది ఇబ్బంది పడుతున్నారని, మమ్ములను కొంతమంది అడుగుతున్నారని అన్నారు. రద్దు అయినట్లు ఇప్పటివరకు ఎలాంటి జీవో గాని సమాచారం గాని మా పై అధికారుల నుండి రాలేదని అలాంటి వాటిని నమ్మవద్దని అన్నారు. ఇప్పటివరకు ఈరోజు వరకు అధికారుల నుండి ఎలాంటి సమాచారం రద్దు అయినట్టు లేదని తెలిపారు. వాట్సాప్ లో వచ్చే వాటిని పూర్తిస్థాయిలో నమ్మే పరిస్థితి లేదని అన్నారు. రాబోయే రోజుల్లో పై అధికారుల నుండి ఏమి సమాచారం వచ్చినా తెలియజేస్తామని అన్నారు.
ఉప సర్పంచ్ కు చెక్ పవర్ రద్దు వార్తలను నమ్మొద్దు: ఎంపీడీవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



