Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాన్వాయిగూడెం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రదీప్ 

కాన్వాయిగూడెం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రదీప్ 

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర
మండలంలోని కాన్వాయిగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బొమ్మెరబోయిన ప్రదీప్ యాదవ్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటుగా గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా భూక్యా నరేష్, తాండల యాకన్న, ప్రధాన కార్యదర్శులుగా ఇడబోయిన రాము, ఏడెల్లి సోమేశ్, కోశాధికారి కర్ర కృష్ణా రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా కొండం మోహన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా రసాల సోమల్లు, ఏడెల్లి వెంకన్న, చెన్న బాలరాజు, కర్ర అశోక్ రెడ్డి, బొమ్మెరబోయిన సైదులు, రేసు అరవింద్, కాసాని పెద్ద కొమరయ్య, భూక్యా కిషన్, తాండల కమలాకర్, కర్ర సోమిరెడ్డి, ఎడెల్లి సోమేశ్వర్, కాసాని శ్రీను, భూక్యా మురళి ఎన్నికయ్యారు. అనంతరం నూతన అధ్యక్షుడు ప్రదీప్ యాదవ్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తామని పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన మండల, గ్రామ స్థాయి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -