Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ షార్ట్ టెండర్ లో గందరగోళం 

విద్యుత్ షార్ట్ టెండర్ లో గందరగోళం 

- Advertisement -

ముగిసిన అత్యవసర పనుల టెండర్ 
మూడు పనులు రీ కాల్
నవతెలంగాణ – మిర్యాలగూడ 

మిర్యాలగూడ డివిజన్లోని 13 మండలాలలో విద్యత్ శాఖ అందించే మెటీరియల్ తో చేపట్టే అత్యవసర పనుల కింద పిలిచిన షార్ట్ టెండర్ మంగళవారం ముగిసింది. మంగళవారం సాయంత్రం టెండర్ ఓపెన్ చేసి  నిబంధనలకు అనుగుణంగా పనులు కేటాయించారు. ఈ 17న సుమారు 60 లక్షల 11 పనులకు టెండర్ ఆహ్వానించగా మిర్యాలగూడ నల్గొండకు చెందిన విద్యుత్ కాంట్రాక్టర్లు 49 మంది టెండర్ దాఖలు చేశారు. ఒక్కొక్క టెండర్కు 525 రూపాయలు చొప్పున డీడీలను స్వీకరించారు. 2025- 2026 సంవత్సరానికి గాను ఈ పనులు చేపట్టాల్సింది.

ఈ పనులకు 20 నుంచి 30 నెంబర్లు ఆధారంగా టెండర్లు పిలిచారు. ఇందులో సుమారు 41 లక్షలు 8 పనులకు 6 నుంచి 10% లేస్ కు వేశారు. దీంతో అత్యధికంగా లెస్కు వేసిన కాంట్రాక్టర్కు పనులు అప్పజెప్పనున్నారు. కాగా 21, 26, 30 నెంబర్ల పనులలో 21, 30 నెంబర్ పనులకు జిల్లా ఉన్నతాధికారి బంధువుకు వచ్చేలా చేశారని కాంట్రాక్టర్లు ఆరోపించడంతో ఆ పనులను నిలిపివేశారు. అదేవిధంగా 26 నెంబర్ గల పనులకు ఎవరు లెస్ వేయకపోవడంతో ఆ పనిని కూడా నిలిపివేశారు. సుమారు 16 లక్షలతో చేపట్టే ఈ మూడు పనులకు అత్యవసరంగా రీకాల్ చేయనున్నట్లు ట్రాన్స్కో డిఇ శ్రీనివాస్ చారి తెలిపారు. కాగా పనులు ఖరారు చేసే సమయంలో లోకల్, నాన్ లోకల్ వివాదం తలెత్తింది. అధికారుల బంధువులకు పని దొరికేలా అధికారులు సహకరించారని కాంట్రాక్టర్లు అధికారులతో వాగిద్వాదానికి దిగారు. దీంతో డి ఈ కార్యాలయంలో కొత్త సేపు గందరగోళం నెలకొంది. ఈ కార్యక్రమంలో టెక్నికల్ కమర్షియల్ ఏఈ వినోద్ కుమార్ టెక్నికల్ సబ్ ఇంజనీర్ వీరభద్రరావు సబ్ ఇంజనీర్ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -