Wednesday, December 24, 2025
E-PAPER
Homeమానవిఆరోగ్యానికి ఎంతో మేలు...

ఆరోగ్యానికి ఎంతో మేలు…

- Advertisement -

చలికాలంలో అందరూ వేడివేడిగా పల్లీలను వేయించుకుని తినాలనుకుంటారు. వీటిని స్నాక్స్‌గా కూడా తీసుకుంటారు. చాలా మంది పల్లీలను చట్నీ చేసుకుంటారు. వీటిల్లో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల పేదవాడి బాదం అని పిలుస్తారు. అయితే కొల్‌స్ట్రాల్‌ పెరుగుతుందని చాలా మంది వీటిని దూరం పెడతారు.

ఇవి నిజంగా కొలెస్ట్రాల్‌ ప్రమాదాన్ని పెంచుతాయా? అనే ప్రశ్న ప్రజల్లో పెరుగుతోంది. దీని గురించి పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..
పల్లీల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెప్పారు. అయితే వేరుశెనగను మితంగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ అదుపులో ఉంటాయని అంటున్నారు. పల్లీలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే, వీటిని గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. అయితే, అధిక వినియోగం ఆరోగ్యానికి హానికరం కాబట్టి మితంగా తీసుకోవాలి.
వీటిల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వాటిని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి ఊబకాయం లేదా అధిక బరువుతో ఉన్నవారు వీటిని తక్కువ మొత్తంలో మాత్రమే తినాలి. అలాగే ఉప్పు ఎక్కువగా వేయకూడదు.

ఇది శరీరంలో సోడియం స్థాయిలను పెంచడమే కాకుండా రక్తపోటు, కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా పెంచుతుంది. కాబట్టి, వేరుశెనగలో ఉప్పు కలపడం మానేయాలి. ఇది కాకుండా, ఒక వ్యక్తి వేరుశెనగ తినడం వల్ల అలెర్జీ ఉంటే, వారు వేరుశెనగను పూర్తిగా తినకూడదు, లేకపోతే వారి ఆరోగ్యం మరింత దిగజారవచ్చు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేరుశెనగలో మంచి మొత్తంలో ప్రోటీన్‌ ఉంటుంది, ఇది కండరాలను బలోపేతం చేయడానికి అవసరం. శాకాహారులు వేరుశెనగను తగిన మోతాదులో తీసుకుంటే ప్రొటీన్‌ లోపం ఏర్పడదు. ఇవి మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ఇది విటమిన్‌ దీ3, మెగ్నీషియం వంటి అంశాలను కలిగి ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయ పడుతుంది. అలాగే వేరుశెనగ తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. శరీర శక్తి స్థాయిలు పెరుగుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -