Wednesday, December 24, 2025
E-PAPER
Homeసినిమాఅంతే అందంగా.. యవ్వనంగా ఉంటే?

అంతే అందంగా.. యవ్వనంగా ఉంటే?

- Advertisement -

తిర్లక క్రియేషన్స్‌ పతాకంపై తిర్లక శ్రీనివాసరావు, తిర్లక బాలసుబ్రహ్మణ్యం సంయుక్తంగా నిర్మిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘యాంటి ఏజింగ్‌ వైఫ్‌’.
బాలసుబ్రహ్మణ్యం, పుష్ప అనూష్‌ జంటగా నటిస్తున్న ఈ సిరీస్‌కి సాయికిరణ్‌, రథన్‌ అనిల్‌ కష్ణ దర్శకులు. ఈ సిరీస్‌ నార్సింగ్‌లో ముహూర్తం జరుపుకుంది. ఫిల్మ్‌ జర్నలిస్ట్‌, అనలిస్ట్‌ ధీరజ అప్పాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మూహూర్తపు షాట్‌కి క్లాప్‌ కొట్టి, యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ‘పెళ్లైనప్పుడు ఎలా ఉందో… పెళ్ళైన పదిహేనేళ్ల తర్వాత కూడా అంతే అందంగా, యవ్వనంగా ఉండే భార్యతో భర్త పడే పడరాని పాట్లు ఈ సిరీస్‌ మెయిన్‌ ప్లాట్‌. హిలేరియస్‌ ఎంటర్టైన్మెంట్‌తో ఈ సిరీస్‌ను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాం’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఎన్‌.సురేష్‌ కుమార్‌, నాయిని శ్రీనివాసరావు, సి.హెచ్‌.బాలాజీ. రథన్‌ అనిల్‌ కష్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌కి రచన: రథన్‌ అనిల్‌ కష్ణ, కెమెరా: నవీన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -