ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘శంబాల’. ఈనెల 25న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. మంగళవారం ఆది సాయి కుమార్ పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ ‘శంబాల’ గురించి ఎన్నో విశేషాలను పంచుకున్నారు.
‘శంబాల’ స్టిల్‌ని రిలీజ్ చేసిన క్షణం నుంచి మంచి బజ్ ఏర్పడింది. హీరోలు దుల్కర్, ప్రభాస్, నాని రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఆడియెన్స్‌లో మా మూవీ పట్ల మంచి బజ్ ఏర్పడింది. ఈసారి మేం మంచి విజయాన్ని అందుకో బోతున్నామనే కాన్ఫిడెన్స్ ఉంది. ఇలాంటి సినిమాని థియేటర్‌లో చూస్తూనే ఆ ఫీల్ కనెక్ట్ అవుతుంది.
ఇందులో అద్భుతమైన పోరాట సన్నివేశాలున్నాయి. రాజ్ కుమార్ మాస్టర్ అన్ని యాక్షన్ సీక్వెన్స్‌కి రిహార్సల్స్ చేశారు. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుంది. 80వ దశకంలో వచ్చే కథ కాబట్టి.. లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.
ఈ సినిమాలో సాంగ్స్ ఎక్కువగా ఉండవు. కానీ శ్రీ చరణ్ పాకాల ఇచ్చిన మ్యూజిక్ కంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతోంది. ఆర్‌ఆర్‌తో ఈ మూవీ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. సినిమా చూసిన తరువాత ప్రతీ ఒక్కరూ ఆర్‌ఆర్ గురించి మాట్లాడుకుంటారు. ప్రతీ ఒక్క పాత్రకి ఆయన అద్భుతమైన థీమ్ సెట్ చేశారు.
‘శంబాల’ అనేది ఉందా? లేదా? అనేది ఎవ్వరికీ తెలీదు. మన పురాణాల ప్రకారం శంబాలకి ఓ మంచి గుర్తింపు ఉంది. ఈ కథ విన్న కొన్ని రోజులకే ‘కల్కి’ రిలీజ్ అయింది. ఆ తరువాత ‘శంబాల’ పేరు మరింత ఎక్కువగా ట్రెండ్ అయింది.
దర్శకుడు యుగంధర్‌కి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంటుంది. ఈ కథ కోసం ఆయన చాలా కష్టపడ్డారు. చెప్పిన కథను తెరపై చూపించారు. ఆయన పెద్ద డైరెక్టర్ అవుతారు. నిర్మాతలు ఎంతో ప్యాషన్‌తో నిర్మించారు. నా మార్కెట్ కంటే ఎక్కువగానే ఖర్చు పెట్టారు. ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున నిర్వహించారు. ఆల్రెడీ చిత్రాన్ని చూశాం. మేం సినిమా పట్ల చాలా సంతప్తిగా ఉన్నాం. హిందీలోనూ మా మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ముందుగా రిలీజ్ చేస్తున్నాం. ఆ తరువాత హిందీలో విడుదల చేయబోతున్నాం.
క్రిస్మస్ అనేది మంచి సీజన్. శ్రీకాంత్ ఫ్యామిలీతో మాకు మంచి బాండింగ్ ఉంది. రోషన్‌తో నాకు మంచి పరిచయం కూడా ఉంది. మా క్రికెట్ టీంలో రోషన్ చురుకుగా ఉంటాడు. రోషన్ నటించిన ‘ఛాంపియన్’ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఈటీవీ విన్‌కి ‘సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్’ చేశాను. ఆ సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకువస్తాం.
థియేటర్‌లో చూస్తేనే ఆ ఫీల్‌కి కనెక్ట్ అవుతారు
- Advertisement -
- Advertisement -



