హీరో మోహన్ లాల్ నటిస్తున్న నూతన చిత్రం ‘వషభ’. ఈ చిత్రాన్ని ఈ నెల 25న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తోంది. కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మించారు. దీన్ని దర్శకుడు నందకిషోర్ మలయాళం, తెలుగులో రూపొందించారు. తాజాగా ఈ సినిమా నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ ‘చిన్ని చిన్ని..’ని రిలీజ్ చేశారు.
సమర్జీత్ లంకేష్, నయన్ సారికపై చిత్రీకరించిన ఈ లవ్ సాంగ్‌కు కల్యాణ్ చక్రవర్తి క్యాచీ లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి మంచి లవ్ ఫీల్‌తో పాడారు. సామ్ సీఎస్ ఛాట్ బస్టర్ ట్యూన్‌తో కంపోజ్ చేశారు.
‘ఎవ్వరే నువ్వెవ్వరే చెప్పవే ఓ దేవత, ఏమిటే ఇదేమిటే ఓ మాయగా ఉన్నదే..’ అంటూ సాగుతుందీ పాట. పునర్జన్మల నేపథ్యంతో హై టెక్నికల్ వ్యాల్యూస్, స్టార్ కాస్టింగ్‌తో విజువల్ వండర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించనుంది అని చిత్రయూనిట్ తెలిపింది.
పునర్జన్మల నేపథ్యంతో ‘వృషభ’
- Advertisement -
- Advertisement -



