Wednesday, December 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి

రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి

- Advertisement -

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌. కృష్ణయ్య
నవతెలంగాణ-హైదరాబాద్‌

పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్‌ కుమార్‌, బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు నీలం వెంకటేష్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో బీసీ విద్యార్థులు బర్కత్‌పుర నుంచి నారాయణగూడ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలోని 8వేల కాలేజీలలో 15 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రన్నారు. అంతేకాక కోర్సు పూర్తయినా కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో విద్యార్థులు సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు కోల్పోతున్నారని అన్నారు. దీంతో అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యార్థుల ఫీజుల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో శివ కుమార్‌ యాదవ్‌, నరేష్‌ గౌడ్‌, జిల్లపల్లి అంజి, అల్లంపల్లి రామకోటి, అనంతుల రామూర్తి గౌడ్‌, రాందేవ్‌ మోడీ, నిఖిల్‌ పటేల్‌, స్నేహ, మంజుల, మమత, మాధవి, అంజలి, అద్విత, సుమలత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -