కార్పొరేటర్లు, స్థానికుల డిమాండ్
విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనుల జాప్యంపై ఆగ్రహం, నిరసన
నవతెలంగాణ-హయత్‌నగర్
విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జాప్యంపై హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో స్థానికులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగి అమాయకులు ప్రాణం కోల్పోతున్నారు. రోడ్డు దాటే క్షణంలోనే ఇటీవల మెడికల్ విద్యార్థిని వాహనం ఢకొీని ప్రాణం కోల్పోయింది. మరో ఘటనలో ఓ పాదచారుడు మృతిచెందాడు. ఈ క్రమంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, సర్వీస్ రోడ్లు వెంటనే నిర్మించాలని కోరుతూ మంగళవారం హయత్‌నగర్ డిపో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరిసర ప్రాంతాల్లో రహదారికి ఇరువైపులా ఉన్న వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది కాలనీవాసులు నిరసనకు దిగారు. హయత్‌నగర్, మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా హయత్‌నగర్ కార్పొరేటర్ మాట్లాడుతూ.. భాగ్యలత నుంచి హయత్‌నగర్ వరకు ఎక్కడా ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు లేకపోవడంతో రోడ్డు దాటే సమయంలో అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ఇటీవల రోడ్డు దాటే క్రమంలో ఓ మెడికల్ విద్యార్థిని మృతిచెందడం, సాయిబాబా గుడి వద్ద రోడ్డుదాటుతున్న ఓ వ్యక్తిని కారు ఢకొీట్టడంతో ప్రాణం కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా హయత్‌నగర్ సూర్యనగర్, ఆర్టీసీ కాలనీ, ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ సర్వీస్ రోడ్లు పూర్తిగా నిర్మించకపోవడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్లకు ఆనుకుని ఉన్న కాలనీ రోడ్లకు బీటీ లింక్ రోడ్లు లేకపోవడంతో వాహనాలు ప్రధాన రోడ్డుపైకి వచ్చే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, సర్వీస్ రోడ్లు, సురక్షిత క్రాసింగ్ సదుపా యాలు, కాలనీ రోడ్లకు బీటీ లింక్ రోడ్లు వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ మాట్లాడుతూ.. అధికార యం త్రాంగం ఇప్పటికైనా స్పందించి పనులు పూర్తి చేయాలని కోరారు. అధికారులు స్పందిం చకపోతే ప్రజలతో కలిసి మరింత పెద్దఎత్తున ఆందోళన చేపడ తామని హెచ్చరించారు. ఈ ఆందోళనతో జాతీయ రహదారిపై కొద్ది సేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, సర్వీస్ రోడ్లు వెంటనే నిర్మించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



