Wednesday, December 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన దీపాలు గ్రంథాలయాలు

అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన దీపాలు గ్రంథాలయాలు

- Advertisement -

గ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటుతో ఆరోగ్యకర వాతావరణం
అవి డిజిటల్‌ విజ్ఞాన కేంద్రాలుగా రూపాంతరం చెందాలి : రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మెన్‌ రియాజ్‌
బుక్‌ ఫెయిర్‌లో ‘పుస్తకాల భవిష్యత్‌- గ్రంథాలయాల పాత్ర’పై చర్చ
నవతెలంగాణ – ముషీరాబాద్‌

సమాజంలోని అజ్ఞానమనే చీకట్లను తొలగించే జ్ఞాన దీపాలు గ్రంథాలయాలు అని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మెన్‌ రియాజ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో 38వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో భాగంగా అనిశెట్టి రజిత వేదికపై మంగళవారం ”పుస్తకాల భవిష్యత్‌- గ్రంథాలయాల పాత్ర” చర్చా కార్యక్రమం జరిగింది. చేగొని రవికుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించగా.. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మెన్‌తోపాటు ఓయూ గ్రంథాలయ శాస్త్ర విభాగం రిటైర్డ్‌ ఆచార్య సుదర్శన్‌రావు, ఓయూ గ్రంథాలయ అధికారి డా.ఎస్‌.యాదగిరి, సెంట్రల్‌ లైబ్రరీ అధికారి రాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మెన్‌ రియాజ్‌ మాట్లాడుతూ.. కేరళ అభివృద్ధిలో ముందుండటానికి అక్కడ విస్తృతంగా ఉన్న గ్రంథాలయాలే కారణమని ఉదహరించారు. తెలంగాణలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు చొరవ చూపడం ద్వారా యువతను డ్రగ్స్‌ వంటి వ్యసనాల నుంచి మళ్లించి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంథాల యాలు కేవలం పుస్తక నిలయాలుగానే కాకుండా, ఇంటర్నెట్‌, ఆధునిక టెక్నాలజీతో కూడిన డిజిటల్‌ విజ్ఞాన కేంద్రాలుగా రూపాంతరం చెందాలని అన్నారు. ఓయూ గ్రంథాలయ అధికారి యాదగిరి మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో గ్రంథాలయాలు గుండెకాయ వంటివన్నారు. తొలి విద్యా కమిషన్‌ చైర్మెన్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చెప్పినట్టుగా.. ప్రతి విద్యా సంస్థలోనూ గ్రంథా లయం అత్యంత కీలక విభాగమని గుర్తుచేశారు.
సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, అది కేవలం ఒక అదనపు వసతి మాత్రమేనని, మనిషి ఆలోచనా సరళిని మెరుగుపరచడానికి పుస్తకమే ప్రాథమిక వనరు అని స్పష్టం చేశారు. ”ఒక సిరా చుక్క వేయి మెదళ్లను కదిలిస్తుంది” అన్న కాళోజీ మాటలను ఉటంకిస్తూ.. పుస్తకాలు ఎప్పటికీ మనుగడలో ఉంటాయని చెప్పారు. రియాజ్‌ నేతృత్వంలో ప్రభుత్వ గ్రంథాలయాల బలోపే తానికి, ఉత్తమ పుస్తక సేకరణకు జరుగుతున్న కృషి అభినం దనీయమని అన్నారు. ఓయూ గ్రంథాలయ శాస్త్ర విభాగం రిటైర్డ్‌ ఆచార్య సుదర్శన్‌రావు మాట్లా డుతూ.. గ్రంథాలయాలు లేని సమా జానికి గతం, వర్తమానం, భవిష్యత్‌ ఉండవని చెప్పారు. అమెరికన్‌ రచయిత రే బ్రాడ్బరీ చెప్పినట్టుగా మానవ మనుగడకు గ్రంథాలయాలే ఆధార మన్నారు. పుస్తకాలు కేవలం కాగితాల ముక్కలు కావని, వాటిలో గత కాలపు మహనీ యుల ఆత్మలు, వారి అనుభవాలు నిబిడీకృతమై ఉంటాయని చెప్పారు. సామాన్యులు తమకు కావలసిన అన్ని పుస్తకాలను కొనుగోలు చేయలేరని, అటువంటి వారికి గ్రంథాలయాలే విజ్ఞాన భాండాగారాలని తెలిపారు. గ్రంథాలయాన్ని ఒక ‘కాల యంత్రం’ (టైమ్‌ మెషీన్‌)తో పోలుస్తూ.. ఇది మనల్ని వందల ఏండ్ల నాటి పూర్వీకుల ఆలోచనల్లోకి తీసుకెళ్లి, వారి జ్ఞానాన్ని నేటి తరానికి అందిస్తుందని వివరించారు. మన సాంస్కృతిక వారసత్వంలో గ్రంథాలయాలు అవిభాజ్య భాగమని, మన సంస్కృతి ఉన్నంత కాలం పుస్తక పఠనం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు పుస్తక ప్రేమికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -