– టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశానికి అన్నం పెట్టే రైతే దేశానికి నిజమైన వెన్నెముక అని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రైతుల శ్రమ, త్యాగాలే దేశ అభివృద్ధికి పునాదిగా నిలిచాయని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా రైతులకు టీపీసీసీ తరఫున అన్నదాతలకు . జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షానే నిలిచి, వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, గిట్టుబాటు ధర, సాగునీటి హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని తెలిపారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఎరువులు, విత్తనాలు, డీజిల్ ధరల పెరుగుదలతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రంలోని బీజేపీ హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. రైతు భరోసా పథకం అమలు, సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ ద్వారా రైతులకు భరోసా కల్పిస్తున్నట్టు వివరించారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న సిద్ధాంతంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



