Wednesday, December 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుచేవెళ్ల బస్సు ప్ర‌మాదం..ప్రధాన నిందితుడిగా టిప్పర్ యజమాని

చేవెళ్ల బస్సు ప్ర‌మాదం..ప్రధాన నిందితుడిగా టిప్పర్ యజమాని

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్. టిప్పర్ యజమాని లచ్చు నాయక్‌ను పోలీసులు నిందితుడిగా నిర్ధారించారు. ప్రమాదానికి ఓవర్‌లోడ్‌తో ఉన్న టిప్పర్‌ను డ్రైవర్ అతివేగంతో నడపడమే కారణమని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఈ మేరకు లచ్చు నాయక్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన చేవెళ్ల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సును మీర్జాగూడ దగ్గర టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 18 మంది ప్రయాణికులు, టిప్పర్ డ్రైవర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగినప్పుడు లచ్చు నాయక్ టిప్పర్‌లోనే ఉన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతను ఇంకా కోలుకోలేదు. పూర్తిగా కోలుకున్న తర్వాతే విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -