Wednesday, December 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలువైఎస్ జగన్‌కు అస్వ‌స్థ‌త‌

వైఎస్ జగన్‌కు అస్వ‌స్థ‌త‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన పులివెందుల పర్యటనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారు.

ఈ విషయాన్ని వైసీపీ అధికారికంగా వెల్లడించింది. పార్టీ ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా జగన్ ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందించింది. పులివెందుల పర్యటనలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. వైఎస్ జగన్ త్వరగా కోలుకుని ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -