నవతెలంగాణ-హైదరాబాద్: భారతీయ బ్యాంకుల్లో వేలకోట్లు అప్పులుగా తీసుకొని, ఆ తర్వాత సదురు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా..బ్రిటన్ లో విలాసవంతమైన జీవితంగా గడుపుతున్నారు. ఇటీవల 70వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విజయ్ మాల్యా బర్త్ డే వేడుకల్లో ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మేమిద్దరం పరారీలో ఉన్న అతి నేరస్థులమని ఆయన వ్యాఖ్యనించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.
అయితే బీజేపీ అధికారం చేపట్టిన 100రోజులోనే విదేశాల్లో చట్ట విరుద్ధంగా బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని భారత్‌కు రప్పించి..ప్రతి పౌరుని ఖాతాలో జమ చేస్తామని మోడీ ప్రభుత్వం బీరాలు పలికింది. అంతేకాకుండా అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను ఇండియాకు రప్పిస్తామని పగల్భాలు పలికారు. కానీ ఆచరణలో మాత్రంలో ఎటువంటి ప్రయత్నం కనిపిస్తలేదని సోషల్ మీడియా యూజర్లు విమర్శిస్తున్నారు. విశ్వగురు అంటూ ప్రచార ఆర్భాటం తప్పా విజయ్ మాల్యాను, లలిత్ మోడీలను ఇండియాకు రప్పించడంలో బీజేపీ సర్కార్ విఫలమైందని కామెంట్ల రూపంలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.



