నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లె దవాఖానా (సబ్సెంటర్) కేంద్రాలను నిర్మించింది. ఇందులో భాగంగా మండలంలోని ఎడ్లపల్లి సబ్ సెంటర్ను 2019 సంవత్సరంలో రూ.25 లక్షల(డీఎం ఎఫ్టీ)తో శంకుస్థాపన చేశారు. పనులు దక్కించు కున్న కాంట్రాక్టర్ పనులను స్లాబ్ వరకు నిర్మించి వదిలేశారు. అనంతరం 2024 సంవత్సరంలో మరో కాంట్రాక్టర్కు అప్పగించి పనులు పూర్తి చేయించారు. మండలంలో ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా రుద్రారం, అన్సాన్పల్లి, పెద్ద తూండ్ల గ్రామాల్లో సబ్ సెంటర్లకు సొంత భవనాలు ఉన్నాయి.
ఎడ్లపల్లి మోడల్ స్కూల్లోని పాత భవనంలో, వల్లెకుంట, మల్లారం గ్రామాల్లో సెంటర్లు గ్రామ పంచాయతీ భవనాల్లో కొనసాగతోన్నాయి. అలాగే తాడిచర్ల-1, తాడిచర్ల-2 అద్దె భవ నాల్లో నడుస్తోన్నాయి. తాడిచర్ల-1 సెంటర్ నిర్మాణం పనులు పిల్లర్ వరకు కాగా మల్లారం సెంటర్ పనులు శంకుస్థాపనకు మాత్రమే పరిమతమైంది. ఎడ్లపల్లి సబ్ సెంటర్ చిన్న చిన్న సమస్యలు మినహా దాదాపు పనులు పూర్తయ్యాయి. పనులు పూర్తయి నెలలు గడిచినప్పటికీ దవాఖాన ప్రారం భానికి నోచుకోవడం లేదు. ప్రస్తుతం సెంటరుకు విద్యుత్ కనెక్షన్, బోరు సమస్య వెంటాడుతోంది.
సెంటర్లో విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయాలంటే కరెంట్ పోల్స్కు విద్యుత్ శాఖకు రూ.లక్ష చెల్లిం చాల్సి ఉంది. అలాగే బోరు ఏర్పాటుకు మరో రూ. లక్ష చెల్లించాల్సి ఉంది. ఈ కారణంగానే నెలలు గడుస్తున్న అధికారులు వినియోగంలోకి తీసుకరాలే దని తెలస్తుంది. దీంతో గ్రామంలో వైద్య సేవలు అందించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా అధికారులు స్పందించి ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణం పెండింగ్ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.



