నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలో రోజురోజుకు వాయు కాలుష్యం పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎయిర్ ప్యూరిఫయర్‌లపై జీఎస్టీ తగ్గించకపోవడం పట్ల ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వాయు నాణ్యతను దృష్టిలో పెట్టుకుని, దానిని ఎమర్జెన్సీగా భావించి ఎయిర్ ప్యూరిఫయర్లపై పన్నులు తగ్గించాలని కోర్టు కోరింది. చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జ్టిస్ తుషార్ రావు గేదెలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలు చేపట్టింది. ఎయిర్ ప్యూరిఫయర్లను మెడికల్ డివైస్‌లుగాభావించి, వాటిపై ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి చేర్చాలని కోర్టులో పిల్ వేశారు. అయితే ఈ అంశంలో ఏమీ చేయలేకపోవడంతో ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి కావాలని, కానీ అధికారులు నాణ్యమైన గాలిని అందివ్వలేకపోతున్నట్లు ధర్మాసనం పేర్కొన్నది. ప్రతి రోజు మనిషి సగటున 21వేల సార్లు శ్వాస పీల్చుకుంటారని అంటే అన్ని సార్లు వాయువు పీలిస్తే దాని వల్ల ఎంత హాని జరుగుతుందో అంచనా వేసుకోవానల్నారు. కపిల్ మదన్ అనే వ్యక్తి ఈ పిటీషన్ వేశారు. తీవ్ర సంక్షోభం వేళ ఎయిర్ ప్యూరిఫయర్లను లగ్జరీ ఐటమ్‌లుగా భావించవద్దు అన్నారు.
నాణ్యమైన గాలి ఇవ్వలేరా?..అయితే ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గించండి: హైకోర్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



