నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గ, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల, రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన పండుగని, క్రిస్మస్ పుట్టకను స్మరిస్తూ నెల రోజులపాటు పండుగను జరుపుకోవడం ఆనవాయితీని పేర్కొన్నారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ప్రేమను పంచుకోవడం, సేవాభావంతో మానవత్వాన్ని కాపాడుకోవడం ఎలా అన్న విషయాలను క్రీస్తు బోధనలు తెలియచేస్తాయని తెలిపారు. ప్రజలంతా క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని, పరస్పర సౌహార్దంతో, శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని సూచించారు. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని, ప్రజలకు ఏసుక్రీస్తు దీవెనలు ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.
రాష్ర్ట ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు: మంత్రి శ్రీధర్ బాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



