Wednesday, May 21, 2025
Homeతెలంగాణ రౌండప్కూలీలను ముంచే లేబర్ కొర్డులు వెనక్కి తీసుకోవాలి

కూలీలను ముంచే లేబర్ కొర్డులు వెనక్కి తీసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలను నిండముంచే కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కొర్డు లను వెనక్కి తీసుకోవాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు అన్నారు. పట్టణ కేంద్రంలోని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ శివప్రసాద్ కు నాలుగు లేబర్ కోర్డ్ లను వెనక్కి తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోర్డు ల ద్వారా ఈ దేశంలో ఉన్న కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు, తమ సమస్యల కోసం మాట్లాడడానికి, సమ్మెకు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేసే ఎటువంటి హక్కులు లేకుండా పోతుందన్నారు. ప్రధానంగా భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగం మీద తీవ్రమైన ప్రభావం ఉంటుందన్నారు. మన రైతులు పండించే పంటను కొనే పరిస్థితి, అమ్ముకునే పరిస్థితి, టమాటాను తినే పరిస్థితి ఉండదన్నారు. ప్రమాదకరమైన చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడితే తాత్కాలికంగా వాయిదా వేసినప్పటికీ మళ్లీ అమలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్డులను రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా పాత లేబర్ కోర్డ్ లను అమలు చేసి కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి వ్యవసాయ కూలీలకు, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్యామ్, సురేందర్, ప్రభాకర్, జావేద్, నవీన్, శంకర్, రాములు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -