నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని పెద్ద ఎడ్గి గ్రామంలో గల బసవన్న మందిరానికి భక్తులు వెళ్లే మార్గంలో పెద్ద పెద్ద బండ రాళ్లు అడ్డుగా ఉండి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండడంతో సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ వారి పంచాయతీ పాలకవర్గంతో కలిసి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. భక్తులు వెళ్లేందుకు మార్గం సుగమం చేయడంతో గ్రామంలోని బసవన్న భక్తులు వీరశైవ లింగాయతులు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా అదే దారి గుండా రైతులకు పొలం పనులకు వెళ్లేందుకు దారి బాగు చేయడంతో కొత్త సర్పంచ్ కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. వచ్చి రాగానే సమస్యలను గుర్తించి న సర్పంచ్ ఒక్కొక్కటిగా పనులు చేపడుతుండడంతో గ్రామంలోని ఓటు వేసిన ప్రజలు సర్పంచ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు నయింఖాన్, రాంబాయి అంజయ్య, లక్ష్మీబాయి చందర్ తో పాటు శ్రీనుపటేల్, సాయిలు, పండరి, లింగురామ్ తదితరులు పాల్గొన్నారు.
బసవన్న గుడి మార్గాన్ని బాగు చేసిన సర్పంచ్
- Advertisement -
- Advertisement -



