Wednesday, December 24, 2025
E-PAPER
Homeజిల్లాలుమండల బంజారా సర్పంచులకు, ఉపసర్పంచులకు సన్మానం

మండల బంజారా సర్పంచులకు, ఉపసర్పంచులకు సన్మానం

- Advertisement -

ఘనంగా సన్మానించిన మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగీత్య

నవతెలంగాణదర్పల్లి

మండల కేంద్రంలోని బంజారా భవనంలో బుధవారం మండలంలోని వివిధ గ్రామాల తాండ సర్పంచులను, ఉపసర్పంచులను, వార్డు మెంబర్లను మాజీ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ మంగీత్య నాయక్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డీసీఎం చైర్మన్ తరచంద్ నాయక్, మాజీ డిప్టీ అధికారి బాపురావు ముఖ్య అతిథులుగా విచ్చేసి నూతన ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు.

సన్మాన గ్రహీతలు, గుగులోత్ స్వామి, మాలవత్ బాలు ఇంద్రనగర్ తండా, మాలవత్ బాలు మోహిదిన్సబ్ తండా, మర్యాతండా గణేష్, ఎస్బి తండా రమేష్, అరుణ గోపాల్, కెలు నడిమి తండా, లత పాండు, లేవుడియా చంద్ర శేఖర్, రాయల్, రావు జి లను సన్మానించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి పాటు పడాలని అన్నారు. మరింత అభివృద్ధికి ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మంత్రుల వద్దకు సమిష్టిగా వెళ్లి అభివృద్ధికి మీవెంట మేమున్నామని భరోసా ఇచ్చారు. అందరిని కలుపుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమములో దత్తు నాయక్, కిషన్ నాయక్, లాల్ సింగ్, సక్రియ నాయక్, తులసి రామ్, గోపి చంద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -