- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని ధర్మారం గ్రామ సమీపంలో చెట్టును ఢీకొని ఓ యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ గొల్లపల్లి అనూష తెలిపారు. బాదంపల్లి గ్రామానికి చెందిన ధూమల్ల వేణు మంగళవారం రాత్రి బైక్ పై వెళ్తుండగా ధర్మారం గ్రామ సమీపంలో ఉన్న చెట్టుకు ఢీకొనడంతో గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని లక్షెట్టిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా.. అప్పటికే మృతి చెందాడని ఎస్ఐ వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -



