- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలం కవ్వాల్ చెందిన వెంకట రాజవ్వ బుధవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా ఆమె తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. అనారోగ్యం తాళలేక మనస్తాపానికి గురై ఉరేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. రాజవ్వ భర్త లచ్చన్న రెండు నెలల క్రితమే మృతి చెందగా.. ఇప్పుడు ఆమె కూడా మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు…
- Advertisement -



