నవతెలంగాణ – కాటారం
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మహాదేవపూర్ లో పర్యటించిన సందర్భంగా ఓ నాయకుడిని మంత్రి మందలిస్తున్న తరుణంలో మహా ముత్తారం ఎస్సై మహేందర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. వార్తను సేకరిస్తున్న తరుణంలో ఓ జర్నలిస్టు కెమెరాను నెట్టివేయడంతో పలువురు జర్నలిస్టులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మండల కేంద్రంలోని నాగేంద్ర గిరి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికై కమిటీ హాల్ నిర్మాణం కోసం హామీ ఇచ్చారు. వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన సర్పంచులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి గెలుపొందిన సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఓ నాయకుడిని మంత్రి మందలిస్తున్న తరుణంలో మహా ముత్తారం ఎస్సై మహేందర్ అతి ఉత్సాహాన్ని ప్రదర్శించారు. వార్తను సేకరిస్తున్న తరుణంలో ఓ జర్నలిస్టు కెమెరాను నెట్టివేయడంతో పలువురు జర్నలిస్టులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.



