Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఆడబిడ్డకు అండగా ఉండాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యం

ప్రతి ఆడబిడ్డకు అండగా ఉండాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యం

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వం అండగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్మని మునుగోడు తాసిల్దార్ నరేష్ అన్నారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో కొంపెల్లి గ్రామానికి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను కొంపల్లి గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల , ఉపసర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి తో కలిసి లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలకు ప్రభుత్వ నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు.

కల్యాణ లక్ష్మి లబ్ధిదారులు సూర పద్మ , వీరమళ్ళ మంగమ్మ , బోయపర్తి లత లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు , కొంపల్లి గ్రామ వార్డు సభ్యులు జీడిమడ్ల ఇందిరమ్మ, జాల నర్సింహా, జీడిమడ్ల మౌనిక, దాము కేతమ్మ, బోయపర్తి ప్రసాద్, గోలి పార్వతీ గార్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు సూదరగోని యాదయ్య, జీడిమడ్ల వెంకటయ్య, దాము నర్సింహా, జాల మాధవి, సంకు యాదగిరి, సంకు శంకర్, గోలి అనిల్  తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -