రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యం

– బీఆర్ఎస్ మండల నాయకుడు కనగండ్ల తిరుపతి 
– అయా గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకుల ఇంటింటా ప్రచారం
నవతెలంగాణ- బెజ్జంకి:
రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే మండల నాయకుడు కనగండ్ల తిరుపతి అన్నారు. బుధవారం మండల పరిధిలోని దాచారం గ్రామంలో బీఆర్ఎస్ మేనిఫెస్టోతో కనగండ్ల తిరుపతి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు. దేశంలో తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనతో ప్రత్యేక గుర్తింపు వచ్చిందని.. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటుతోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి మోసపోకుండా మళ్లీ ఎమ్మెల్యేగా రసమయి బాలకిషన్ ను భారీ మేజారిటీతో గెలిపించి బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని ప్రజలకు విజ్ఞప్థి చేశారు. నాయకులు కనగండ్ల సతీశ్, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Spread the love