Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు 

ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు 

- Advertisement -

–  ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వర రావు 
నవతెలంగాణ –  కామారెడ్డి

ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించ వచ్చునని ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వర రావు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లో ఉచితంగా స్కిల్  డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ను అయిన బుధవారం  ప్రారంభించారు.  దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుందని, తగినంత చదువు నైపుణ్యం లేక చాలామంది ఉద్యోగం పొందలేకపోతున్నారని తెలిపారు. అలాంటి వారి కోసం రెసిడెన్షియల్ ఒకేషనల్ స్కిల్ లో  శిక్షణ ఇవ్వడానికి ఈ కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని  పేర్కొన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని సూచించారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా 60 రోజులపాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ఫౌండేషన్ లో విద్యార్థులకు ప్రత్యేక వసతి సౌకర్యంతో పాటు శిక్షణ సమయంలో భోజనం తదితర సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ అనంతరం ప్రథమ్ సమస్త  ద్వారా గుర్తింపు పొందిన సర్టిఫికెట్ జారీ చేయడమే కాకుండా ఉద్యోగం ఇప్పించుటలో మద్దతు తెలపడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -