Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ గా సురేందర్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ గా సురేందర్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి 
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లా మినిస్ట్రీ నుండి కామారెడ్డి జిల్లా కు కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా  బండారు సురేందర్ రెడ్డి నియామకమయ్యారు. కేంద్ర ప్రభుత్వ లా మినిస్ట్రీ నుండి కామారెడ్డి లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి కామారెడ్డి జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది బండారి సురేందర్ రెడ్డి ని మంగళవారం కేంద్ర ప్రభుత్వ లా మినిస్ట్రీ, జస్టిస్ నుండీ కేంద్ర ప్రభుత్వం తరఫున కామారెడ్డి జిల్లాకు న్యాయవాదిగా ఎన్నిక చేసారు.  గత 16 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ.. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా లీగల్ సెల్ కన్వినర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నరు. న్యాయవాదిగా బీజేపీ పార్టీ శ్రేణులకు, నాయకులకు ఎల్లప్పుడూ సేవలను అందించిన బండారి సురేందర్ రెడ్డి  సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా నియామకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర  లీగల్ సెల్ కన్వినర్ రామారావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -