Wednesday, December 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిజిటల్ న్యాయ వ్యవస్థ ద్వారా వేగంగా కేసుల పరిష్కారం

డిజిటల్ న్యాయ వ్యవస్థ ద్వారా వేగంగా కేసుల పరిష్కారం

- Advertisement -

– కలెక్టర్ (పౌర సరఫరాలు) కామారెడ్డి (ఇంచార్జీ)  సి. హెచ్. మధుమోహన్ 
నవతెలంగాణ –  కామారెడ్డి

ఐ డి ఓ సి కార్యాలయంలో బుధవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం కలెక్టర్ (పౌర సరఫరాలు) కామారెడ్డి (ఇంచార్జీ)  సి. హెచ్. మధుమోహన్  ఆధ్వరయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ న్యాయ వ్యవస్థ ద్వారా త్వరిత గతిన సమర్ధవంతంగా కేసుల పరిష్కారం అనే అంశం పైన ఆయన ప్రసంగించారు. ఈ సంధార్బంగ వినియోగదారుల హక్కుల రక్షణ హక్కుల రక్షణలో సాంకేతికత యొక్క వినియోగం వాటి పర్యవసనాలు, తీసుకోవాలిన జాగ్రతలు, పిర్యాదులు, పరిష్కారాలు మొదలైన అంశాల తెలియ పరుస్తూ, వినియోగదారుల హక్కుల చట్టం సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదెశించారు. స్వచ్ఛంద వినియోగదారుల సంస్థల యొక్క సభ్యులు వారు వినియోగదారుల హక్కుల రక్షణలో సాధించిన విజయాలు, సమస్యలు, పరిష్కార సూచనలు మొదలైన అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు డిసిఎస్ఓ వెంకటేశ్వర్రావు, డిఎం శ్రీకాంత్, జిల్లా లీగల్ మెట్రోలోజి ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, పౌర సరఫరాల సిబ్బంది, పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -