నవతెలంగాణ – కామారెడ్డి
నవతెలంగాణ పత్రిక నిరంతరం పేదల కోసం, పేదలకు సంబంధించిన వార్తలు రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో కామారెడ్డి నవ తెలంగాణ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కార్మికుల, కర్షకుల కు సంబంధించిన ప్రతి వార్తను ప్రచురిస్తూ అధికారులకు తెలియజేస్తూ ఆ సమస్య పరిష్కారం ఎలాగో వివరిస్తూ కథనాలను రాస్తు నవతెలంగాణ తన ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు అడిషనల్ ఎస్పీ ( అడ్మిన్ ) కే నరసింహారెడ్డి, నవతెలంగాణ కామారెడ్డి డివిజన్ ఇంచార్జ్ నరేష్, కామారెడ్డి విలేకరి డాకురి మోహన్, రామారెడ్డి విలేఖరి తిరుపతిరెడ్డి, సదాశివ నగర్ విలేఖరి లింగం తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ నిరంతరం పేదల పక్షం: ఎఎస్పీ చైతన్య రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



