Wednesday, December 24, 2025
E-PAPER
Homeజిల్లాలు370 క్వింటాళ్ల అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత

370 క్వింటాళ్ల అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత

- Advertisement -

పరారీలో నిందితులు..
బియ్యాన్ని తరలిస్తున్న లారీల స్వాధీనం 
డ్రైవర్ల అరెస్ట్, రిమాండ్ కు తరలింపు : ఎస్సై పవన్ కుమార్ 
నవతెలంగాణ – పాలకుర్తి

ఖమ్మం జిల్లా మధిర నుండి మహారాష్ట్రకు రెండు లారీలల్లో అక్రమంగా తరలిస్తున్న 370 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్సై దూలం పవన్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాదుకు చెందిన ఐతె కృష్ణ, ఐతె శ్రీకాంత్ లు ప్రభుత్వం పేదలకు అందించే పిడిఎస్ సన్నబియ్యాన్ని కొనుగోలు చేసి ఏపీ 16 టీ వై 1688, ఏపీ 28 టి ఏ 7432 నంబరు గల లారీలల్లో 370 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో మండల కేంద్రంలో గల వల్మిడి క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా .. అనుమానస్పదంగా బియ్యాన్ని తరలిస్తున్న లారీలను తనిఖీ చేసి అదుపులోకి తీసుకొని సివిల్ సప్లై అధికారులకు సమాచారాన్ని అందించామని తెలిపారు.

సివిల్ సప్లై అధికారులు లారీలల్లో ఉన్న బియ్యాన్ని పరిశీలించగా ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్నబియ్యమేనని నిర్ధారించారని తెలిపారు. జార్ఖండ్ కు చెందిన లారీ డ్రైవర్ల పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించామని, అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న లారీలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పిడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న కృష్ణ, శ్రీకాంత్ లు పరారీలో ఉన్నారని వివరించారు. నిందితులపై కేసు నమోదు చేశామని తెలిపారు. రెండు లారీలలో తరలిస్తున్న 370 క్వింటాళ్ల బియ్యం విలువ సుమారు 16 లక్షలు ఉంటుందని అన్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకొని అరెస్టు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు అందిస్తున్న సన్నబియ్యాన్ని కొనుగోలు చేసే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దార్ నునావత్ లచ్చు నాయక్, హెడ్ కానిస్టేబుల్ సోమిరెడ్డి, సిబ్బంది మారయ్య లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -