Wednesday, December 24, 2025
E-PAPER
Homeఖమ్మంగ్రామ సమస్యలపై ఎంపీడీఓతో చర్చించిన సర్పంచ్ పోలయ్య

గ్రామ సమస్యలపై ఎంపీడీఓతో చర్చించిన సర్పంచ్ పోలయ్య

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
పంచాయితి లోని సమస్యలు పరిష్కారానికి సహకరించాలని ఎంపీడీఓ అప్పారావు ను అచ్యుతాపురం సర్పంచ్ సరద్దుల పోలయ్య విజ్ఞప్తి చేసారు. ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిగా ఆయన ఎంపీడీఓ ను బుదవారం మర్యాదపూర్వకంగా కలిసారు.సర్పంచ్ కాక మునుపు పోలయ్య గ్రామీణ ఉపాధి హామీ పధకం క్షేత్ర సహాయకుడిగా ఎంపీడీఓ పర్యవేక్షణలో పనిచేసిన పోలయ్య సర్పంచ్ గా నేడు ఆయన గ్రామ సమస్యల పరిష్కారం కోసం చర్చించారు.

ఈ సందర్బంగా ఎంపీడీఓ అప్పారావు గ్రామ పరిపాలన పై పలు సూచనలు,సలహాలు ఇచ్చారు.పాలక వర్గం సభ్యులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు పానుగంటి ప్రసాద్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -