Thursday, December 25, 2025
E-PAPER
Homeకరీంనగర్రాయికల్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం

రాయికల్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం

- Advertisement -

-కుడిచేతిపై ‘మౌనిక మల్లేష్’, ఛాతిపై ‘అమ్మ నాన్న’ పచ్చబొట్టు
నవతెలంగాణ – రాయికల్

పట్టణ శివారులోని చెరువులో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. 32 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. చెరువులో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చెరువు నుంచి వెలికి తీశారు. మృతుడి ఛాతిపై ‘అమ్మ నాన్న’, కుడి చేతిపై ‘మౌనిక మల్లేష్’ అనే పచ్చబొట్టు ఉన్నట్లు ఎస్ఐ సుధీర్‌రావు తెలిపారు. యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక హత్యకు గురయ్యాడా? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. మృతుడిని గుర్తించే వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -