నవతెలంగాణ – రాయికల్
మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ నీరటి ప్రవీణ్‌పై గతంలో నిర్వహించిన 10వ రౌండ్ సామాజిక తనిఖీలో భాగంగా, రూ.3 లక్షల పనుల నిర్వహణ రికార్డుల్లో అవకతవకలు జరిగినట్లు, అలాగే రూ.1 లక్ష 54 వేల నిధుల రికవరీకి ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో ప్రవీణ్‌ను సస్పెండ్ చేశారు. అయితే తనపై మోపిన ఆరోపణలు నిరాధారమని పేర్కొంటూ, ప్రవీణ్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలుమార్లు వినతులు సమర్పించారు. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మదన్మోహన్ ఆధ్వర్యంలో గత రికార్డులపై పునర్విచారణ చేపట్టారు. ఈనెల 30వ తేదీలోగా పూర్తి స్థాయి రికార్డులు, ఆధారాలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో,ఈ అభియోగాల్లో పాత్ర ఉన్నట్లు పేర్కొనబడుతున్న అప్పటి టెక్నికల్ అసిస్టెంట్,ఏపీవోలు విచారణకు హాజరుకాకపోవడం గమనార్హంగా మారింది. ఈ విచారణలో ఇటిక్యాల సర్పంచ్ నీరటి శ్రీనివాస్,ఎంపీడీవో బింగి చిరంజీవి,అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
నిధుల దుర్వినియోగంపై పునర్విచారణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



