జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
టీ పీసీసీ చీఫ్, ప్రభుత్వ సలహాదారుకు వినతి పత్రం
నవతెలంగాణ – రామారెడ్డి
కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కామారెడ్డి జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులకు భీమా సౌకర్యం కల్పిస్తే, ఆపద సమయంలో ఆర్థికంగా కుటుంబాలను ఆదుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి సభ్యునికి రూ 5 లక్షల జీవిత బీమా, ఆరోగ్య బీమా కల్పించాలని వినతిపత్రం అందజేశామని, అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అమలు చేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నా రెడ్డి మోహన్ రెడ్డి తో పాటు రగోతం రెడ్డి, అన్నారం ఉప సర్పంచ్ దయానంద్, సంతోష్ రెడ్డి, శ్రీనివాస్, గంగారెడ్డి, లక్ష్మణ్, ఎల్లం, స్వామి, రెడ్డి నాయక్, సత్యం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ శ్రేణులకు బీమా కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



