Wednesday, May 21, 2025
Homeతెలంగాణ రౌండప్శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
  • – మండల విద్యాశాఖ అధికారి ఎం రామదాస్ 
  • నవతెలంగాణ – నెల్లికుదురు 
    ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యాలు మెలకువలను పెంపొందించుట  నిర్వహిస్తున్న  శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి ఏ రాందాస్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో మంగళవారం మండల స్థాయి ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఎంఈఓ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న అంశాలను తరగతి గదుల్లో అమలుపరిచి విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు శిక్షణ తరగతులు పకడ్బందీగా పటిష్టంగా జరుగుతున్నాయని ప్రతి ఉపాధ్యాయుడు విధిగా ఐదు రోజులపాటు శిక్షణ తరగతులు పాల్గొని మెలకువలను నేర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు ఆర్ లక్ష్మీనారాయణ ఎస్ చంద్రశేఖర్ ఈ మధు బాబు పి సంతోష్ ఈ కరుణాకర్ ఎం సుధాకర్ సిహెచ్ రమేష్ లతోపాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు మండల ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ ఎం సుధాకర్ కంప్యూటర్ ఆపరేటర్ హెచ్ ఉపేందర్ సి ఆర్ పి లు ఏ భాస్కర రావు బి వీరస్వామి బి కవిత జే కవిత మెసెంజర్ ఆర్ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -