– నూతన పంచాయతీ పాలకవర్గాలకు..
– ప్రజలకు అందుబాటులో ఉండి సేవాలందించాలను సూచన.
నవతెలంగాణ – మల్హర్ రావు:
కాటారం డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ బలపర్షిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించి,బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు కాటారం డివిజన్ లోని మల్హర్, మహముత్తరం, మహాదేవపూర్, కాటారం,పలిమేల మండలాల్లోని సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు,వార్డు సభ్యులకు కాటారం ఏవిఎస్ పంక్షన్ హాల్లో అభినందన సభ నిర్వహించారు.ఈ సందర్భంగా నూతన పాలవవర్గాలకు శుభాకాంక్షలు,అభినందించారు.శాలువాలతో సత్కరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిస్కారం చేస్తూ సేవాలందించాలన్నారు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా చూడాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి,గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు,ఈజిఎస్ రాష్ట్ర సభ్యుడు దండు రమేష్,తాజా మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,నూతన సర్పంచ్ లు బండి స్వామి,మేకల రాజయ్య,బండారి నర్సింగరావు,కొండ రాజమ్మ,బొమ్మ రజిత, అబ్బినేని లింగస్వామి,జంగిడి శ్రీనివాస్, చంద్రగిరి సంపత్,జాడి రాములు,జ్యోత్స్న,గడ్డం క్రాoతి,గుగులోతు మంజుల,ఒర్రె వనమ్మ,ఉప సర్పంచ్ లు బొబ్బిలి రాజు గౌడ్,తాళ్ల రవిందర్,బడితేల కుమారస్వామి,తూటి లావణ్య,వార్డు సభ్యులు ఇందారపు చెంద్రయ్య,వొన్న తిరుపతి రావు,కేశవ్,జంబోజు సంధ్యారాణి-రవిందర్, ఇందారపు సారయ్య,పైడాకుల దేవేంద్ర,కుంభం రాజేశ్వరి-ముకుందరెడ్డి,చంద్రగిరి అశోక్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



