హీరో విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి.అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా ‘ధీరే ధీరే’ విడుదలైంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తొలి పాట ‘ధీరే ధీరే’కి అద్భుతమైన సంగీతం అందించి, విడుదలైన తక్షణమే శ్రోతల మనసులో చోటు సంపాదించుకునేలా చేశారు. ఈ మధురమైన పాటను సంజిత్ హెగ్డే, రోహిణి సోరట్ ఆలపించగా, దర్శకుడు కె.వి. అనుదీప్ సాహిత్యం అందించడం విశేషం అని చిత్ర బృందం తెలిపింది. ‘వినసొంపుగా ఉన్న ఈ ‘ధీరే ధీరే’ మెలోడి, వినగానే శ్రోతల అభిమాన గీతంగా మారిపోయేలా ఉంది. విశ్వక్ సేన్, కయాదు లోహార్ జోడి పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది.
పాటలో కొత్తదనం ఉట్టిపడటమే కాకుండా, యువతకు చేరువయ్యేలా ఉంది. భీమ్స్ సిసిరోలియో శైలి సంగీతానికి శ్రోతలలో ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, ఆయన శైలిలో సాగిన ఈ ‘ధీరే ధీరే’ పాట తక్షణ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది’ అని మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నవ్వులు, గందరగోళం, స్వచ్ఛమైన వినోదానికి పేరొందిన అద్భుతమైన కలయికలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు కె.వి. అనుదీప్ ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. ‘జాతిరత్నాలు’ సినిమాతో సంచలనాలు సృష్టించిన ఆయన మరోసారి విభిన్నమైన కథాంశం, కట్టిపడేసే హాస్యంతో ప్రేక్షకుల మనసు దోచుకోనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
భారీతనానికి, విజయవంతమైన చిత్రాలకు పేరొందిన నిర్మాణ సంస్థల నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘ఫంకీ’పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘ఫంకీ’ చిత్రం ప్రేక్షకులకు నవ్వుల విందుని అందిస్తుందని చిత్ర బృందం హామీ ఇచ్చింది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెడుతున్న ‘ఫంకీ’ చిత్రం ప్రేక్షకులకు వినోదాల విందుని అందించనుంది. విశ్వక్ సేన్, కయాదు లోహర్, నరేష్, వీటీవీ గణేష్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: సురేష్ సారంగం, రచన: అనుదీప్ కె.వి, మోహన్, కళా దర్శకుడు: జానీ షేక్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.
రెట్టింపు వినోదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



